సైకిల్ తొక్కటం వలన కలిగే ప్రయోజనాలు
మానవుడు పుట్టిన తరువాత తన అవసరాలు తీర్చుకోవటానికి ఎన్నో రకాల యంత్రాలు తయారుచేసుకున్నాడు.అదే తరహాలో సైకిల్ ని కూడా తయారుచేసుకున్నాడు. జనాభా తక్కువగా వున్నపుడు దూరపు ప్రాంతాలకు వెళ్ళటానికి రవాణా సౌకర్యాలు లేని రోజులలో సైకిల్ ని తొక్కుకుంటూ దూరపు ప్రాంతాలకు వెళ్లి పనులు చూసుకుని ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుండేది. సైకిల్ తొక్కటం వలన రక్తప్రసరణ బాగా జరిగి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ చక్కగా ” చరైవేతి చరైవేతి ” గా రాత్రి పగలు తన కార్యక్రమాలు చక్కగా పని చేస్తూ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.త్వరగా రోగాలు కూడా వచ్చేవి కావు.
ఇప్పుడు జనాభా పెరగటం, అవసరాలు పెరగటం, ఉద్యోగ్యరీత్యా దూరప్రాంతాలకు వెళ్ళటం, మరియు రోడ్లు విస్తీరణం కావటం, రవాణా సౌకర్యాలు పెరగటం, మానవుని జీవన విధానం లో పెను మార్పురావటం జరిగింది. ఊరిలో విద్యాభ్యాసం కోసం మనం సైకిల్ మీద పోయి వెళ్ళివచ్చేది , మరియు ఇంట్లో ప్రతి పనికి బజారుకి పోవటానికి, ఊరిలో ఉద్యోగం చేయటానికి పోవటం కొరకు, మరియు friends తో కలిసి సరదాగా సైకిల్ పందాలు ఆడటం ఇలాంటి వాటి కొరకు సైకిల్ ని వాడుకునే వారు. మరియు ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఫీజికల్ గా, మెంటల్ గా, దృడంగా ఉండేవారు.
కానీ ఇప్పుడు రాను రాను మనిషి తన అవసరాల కొరకు పనిని త్వరగా చేసుకోవటానికి, మరియు కాలాన్ని వృధా చేయకుండా ఉండటానికి సైకిల్ ని పక్కకి పెట్టి, మోటార్ వెహికల్ ని వాడటం మొదలు పెట్టినాడు. ఎప్పుడు సైకిల్ పక్కకు పెట్టి సుఖంగా బైక్ లు మీద తిరగటం మొదలు పెట్టటం ప్రారంభం కాగానే శరీరానికి మినిమం వ్యాయామం లేక రక్త ప్రసరణ సరిగ్గా జరగక చిన్న చిన్న రోగాలు రావటం జరిగి రాను రాను అవే పెద్ద రోగాలుగా మారి మందులు వాడి వాడి జీవితం మీద విరక్తి వచ్చేది. ఇలా చిన్న చిన్న రోగాలకు అడ్డుకట్ట వేయాలంటే కనీసం మరల మనం సైకిల్ రోజుకి 5 కిలోమీటర్స్ తొక్కటం ప్రారంభించాలి. అప్పుడే దరిదాపు రోగాలు రావు. ఆరోగ్యంగా ఉంటాం.
సైకిల్ తొక్కటం వలన కలిగే ప్రయోజనాలు
- సైకిల్ తొక్కటం వలన మనకు ఏరోబిక్ excercise చేసినంతగా లాభం కలుగుతుంది.
- సైకిల్ తొక్కటం casual గా అలవాటు చేసుకోవాలి.
- సైకిల్ తొక్కటం ఒక వర్కౌట్ వలన ఆక్టివ్ గా ఉంటాం.
- సైకిల్ తొక్కటం వలన శారీరక, మానసికంగా ఆరోగ్యం ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది.
- మనం కనీసం రోజుకు ఒక్కసారి అయినా సైకిల్ తొక్కితే ఫిట్ గా ఉంటాం.
- సైకిల్ తొక్కటం వలన కాళ్ళు దృడంగా మారుతాయి. Flexible గా ఉంటుంది.పాదాలు మీద ఒత్తిడి పడి అక్యూప్రెషర్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.మాంసపు కండరాలు పుష్టిగా ఉంటాయి. వెయిట్ లిఫ్ట్ excercise లాగా పని చేస్తుంది. లెగ్ ప్రెస్, వలన లంగ్స్ చక్కగా పనిచేసి శ్వాస బాగా నడుస్తుంది.
- సైకిల్ తొక్కటం వలన చాలా సులువుగా ఫ్యాట్ కరిగి బరువు తగ్గవచ్చును.బరువు పెరగకుండా చూస్తుంది.
- ఇలానే ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మెటబాలిజమ్ పెరుగుతుంది. మరియు పటిష్టమైన
- మాంసపు కండరాల నిర్మాణం జరుగుతుంది. తిన్నది త్వరగా అరుగుతుంది.దింతో అధిక క్యాలరీలు కూడా బర్న్ అవుతాయి.
- సైకిల్ తొక్కటం వలన (హెల్త్ enhancing effect,)కొలెస్ట్రాల్ తగ్గటానికి ఉపయోగపడుతుంది.
- గుండెకు చక్కగా రక్త ప్రసారణ జరిగి గుండెపోటు రావటం జబ్బులు తగ్గుతాయి.
- ఇండూర్ సైకిల్ తొక్కటం వలన కొలెస్ట్రాల్ మీద సకరాత్మక ప్రభావం పడి LDL (chedu) కొలెస్ట్రాల్ మరియు trigiyceride లెవెల్ ని తగ్గిస్తుంది.HDL కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.
- సైకిల్ తొక్కటం వలన కాన్సర్ పేషెంట్ కి చాలా ఆరోగ్యావంతగా ఉంచుతుంది. కాన్సర్ పేషెంట్స్ కి వొళ్ళు నొప్పులు రావటం తగ్గిస్తుంది. కాన్సర్ పేషెంట్స్ కొంతమంది సరిగా ఆకలి వేయక తినలేరు, వారికీ సైకిల్ తొక్కటం వలన ఆకలి వేస్తుంది. తగిన ఆహారం తీసుకుంటారు దానితో కాన్సర్ కూడా పెరగకుండా కొంతలో కొంత తగ్గుతుంది. కాన్సర్ పేషెంట్ కి సైకిల్ తొక్కటం వలన ఆరోగ్యం గా వుంటారు. జీవిత కాలం ఎక్కువగా పెరుగుతుంది.
- సైకిల్ తొక్కటం వలన మానసిక ఒత్తిడి తగ్గి , మెదడు యొక్క శక్తి పెరిగి చురుకుగా మారుతుంది.
- సైకిల్ తొక్కటం వలన క్షణిక అవేశాన్ని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. వ్యర్థమైన ఆలోచనలు రాకుండా చేసి చేస్తుంది.
- ఉదయం వేళలో సైకిల్ తొక్కటం వలన పాజిటివ్ ఆలోచనలకు, మరియు ముఖంలో,ఓజం, తేజం, కాంతి పెరుగుతుంది.
- సైకిల్ ప్రతిరోజు 45 నిముషాలు తొక్కండి. శరీరం నుండి చమట బయటికి వచ్చి చర్మ కాంతి పెరుగుతుంది. ముఖం మీద మొటిమలు వున్న తగ్గుతాయి.చిన్న వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చిన తగ్గుతాయి.
హెచ్చరిక
అతిగా సైకిల్ తొక్కితే వెరికోస్ వీన్స్, వేరికోసెల్స్ కూడా రావచ్చును. మితంగా తొక్కండి ఆరోగ్యంగా వుండండి
షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు