జ‌ల‌దిగ్భంధంలో భ‌ద్రాచ‌లం.. కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు..

భ‌ద్రాచ‌లం (CLiC2NEWS): భారీ వ‌ర్షాల‌తో భ‌ద్రాచ‌లంలో గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చింది. శుక్ర‌వారం నీటిమ‌ట్టం 68.3 అడుగుల‌కు చేరింది. ప్ర‌మాద‌క‌ర స్థాయిలో వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తుండ‌టంతో లోత‌ట్టు కాల‌నీల‌లో నివ‌సించే వారిని పున‌రావాస‌కాల‌నీల‌కు త‌ర‌లించారు. వ‌ర‌ద ప్ర‌భావ ప్రాంతాల్లో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. భ‌ద్రాచ‌లం, బ‌రూర్గంపాడు మండ‌లాల మ‌ధ్య‌నున్న వార‌ధిపై రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.

భ‌ద్రాద్రి రామ‌య్య స‌న్నిధిలోని అన్న‌దాన సత్రంలో వ‌ర‌ద‌నీరు భారీగా చేరుకుంది. దీంతో అన్న‌దానం నిలిపివేశారు. ప‌ట్ట‌డానికి ర‌క్ష‌ణ‌గా ఉన్న క‌ర‌క‌ట్ట లాక‌ర్ల‌కు లీకులు ఏర్ప‌డ‌టంతోపాటు, వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో ఆల‌య ప‌రిస‌రాల్లో నీరు భారీగా చేరింది. ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌, క‌లెక్ట‌ర్ అనుదీప్ భ‌ద్రాచ‌లంలోనే ఉంటూ వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లును ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.