Bharat Biotech: భద్రత పెంపు

హైద‌రాబాద్ (CLiC2NEWS) : ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వ్యాక్సిన్ల పాత్ర కీల‌క‌మైన‌ది. క‌రోన మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగం చేసింది. అలాగే వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి కూడా పెంచేలా ఆయా వ్యాక్సిన్ల సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ త‌యారీ చేస్తున్న సంస్థ‌ల ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం భ‌ద్ర‌త చ‌ర్య‌లను క‌ట్టుదిట్టం చేస్తోంది. ఈ క్ర‌మంలో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్​ సంస్థ కు భద్రత పెంచారు. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ లో ‘కోవాగ్జిన్‌’ తయారు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సంస్థ వ‌ద్ద సీఐఎస్​ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)​తో భ‌ద్ర‌త ప‌టిష్టం చేశారు. పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం భద్రతను పర్యవేక్షించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.