`భారతరత్న` తోనే ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం: చిరంజీవి

హైదరాబాద్ (CLiC2NEWS): దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ) జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
“కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.“ అని చిరంజీవి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024