ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన జి20 సదస్సు..
ఢిల్లీ (CLiC2NEWS): భారత్ అధ్యక్షత వహిస్తున్న జి20 సదస్సు అత్యంత ప్రతిష్టాత్మకమైనదని భారత్ షెర్బా అమితాబ్ కాంత్ ఎక్స్ ట్విటర్లో వెల్లడించారు. ఈ సదస్సులో మొత్త 112 అంశాలపై సభ్యదేశాలు సానుకూలంగా స్పందిచినట్లు తెలిపారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. డిక్లరేషన్‌లో అభివృద్ధి, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై సభ్యుల నుండి పూర్తి ఏకాభిప్రాయం సాధించామన్నారు. డిక్లరేషన్‌లో ప్రధానంగా ఉన్నటువంటి బలమైన, స్థిరమైన , సమతుల్యమైన, సమగ్రవృద్ధి, వేగవంతమైన సుస్థిరాభివృద్ధి, సుస్థిర భవిష్యత్తు కోసం హరిత అభివృద్ధి ఒప్పందం, 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు, బహుపాక్షికతను పునరుద్దరించడం.. అంశాలపై సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చారు.