టిఆర్ ఎస్…ఇకపై భారత్ రాష్ట్ర సమితి
తీర్మానంపై సంతకం చేసిన కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు భారత్ రరాష్ట్రసమితిగా మారుస్తూ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు తీర్మానం ప్రవేశపెట్టారు. దసరనాడు (బుధవారం) హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మనం ప్రవేశ పెట్టగా.. పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ సభ్యుల ఆమోదం తర్వాత కెసిఆర్ ఆ తీర్మానంపై సంతకం చేశారు. ఆ తర్వాత తీర్మానాన్ని చదివి అందరికి వినిపించారు. భారత్ రాష్ట్ర సమితి పేరును ప్రకటించిన అనంతరం కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సర్వసభ్య సమావేశం అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎం కెసిఆర్ లేఖ రాశారు. టిఆర్ ఎస్‌ను బిఆర్ ఎస్‌గా మారుస్తూ… పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని ఈసిని కెసిఆర్ లేఖలో కోరారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.