‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక వాయిదా..!

హైదరాబాద్ (CLiC2NEWS): భీమ్లా నాయక్ చిత్రం ప్రీరిలీజ్ వేడుకు వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎపి మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, ఆయన మృతికి నిశాళి అర్పిస్తూ భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకను ఈరోజు నిర్వహించటం లేదని చిత్ర బృందం ట్విటర్ వేదికగా ప్రకటించింది. గౌతంరెడ్డి మృతిపట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషాద సమయంలో సినిమా వేడుక చేయటానికి మనస్కరించటం లేదని ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో ‘భీమ్లానాయక్’ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.