Peddapelli: అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి భూమి పూజ

పెద్దపల్లి (CLiC2NEWS): యువతకు సర్కార్ కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్‌లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి మంగళవారం భూమి పూజ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత, బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఐదు కోట్ల రూపాయలతో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.