రైలు కింద పడి ప్రేమికులు ఆత్మహత్య..!

భువనగిరి (CLiC2NEWS): జిల్లాలోని బాహుపేట సమీపంలోని రైల్వేట్రాక్‌పై రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందినవారు యాదగిరిగుట్ట, బస్వాపూర్ గ్రామానికి చెందిన గణేశ్, నలందగా పోలీసులు గుర్తించారు. తెలిపిన వివరాల ప్రకారం.. నలందకు మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట పట్టణానికి చెందని యాదగిరితో వివాహం జరిగింది. యాదగిరి దేవస్థానంలోని లడ్డు తయారీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను విధులు ముగించుకొని ఇంటికి రాగా.. భార్య కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం బాహుపేట పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లికి ముందే నలంద గణేశ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.