TS: అంగన్‌వాడీ టీచర్‌కు భారీగా జీతాల పెంపు

హైదరాబాద్‌ (CLiC2NEWS): అంగన్‌వాడీ టీచ‌ర్ల‌కు, ఆయాల‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 71,400 మందికి లబ్ధి చేకూర‌నుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% వేతనాలు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన వేతనాలు జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. వేతనాల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు సంబురాలు చేసుకుంటున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సం ఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.