బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్‌కుమార్ సిన్హా రాజీనామా..
పాట్నా (CLiC2NEWS): అసెంబ్లీలో నితీశ్ ప్రభుత్వం బలపరీక్షకు ముందే స్పీకర్ విజయ్‌కుమార్ సిన్హా పదవికి రాజీనామా చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేవపెట్టడంపై అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ పదవిని అవమానించి .. ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలని చూస్తున్నారు.. ప్రజలే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంతో పాటు సమర్పించిన లేఖలు కొన్ని నిబంధనల ప్రకారం లేవని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
బిజెపితో విడిపోయిన జెడియు ..మహాకూటమితో కలిసి మహాగట్ బంధన్ ప్రభుత్వం ఆగస్టు 10వ తేదీన ఏర్పాటుచేసింది. మహాకూటమి సర్కార్ ఏర్పాటు చేసి రెండు వారాలు కావొస్తుంది. కానీ బిజెపికి చెందని విజయ్‌కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. ప్రభుత్వం మారతే.. అంతకుముందు ఉన్న స్పీకర్ రాజీనామా చేస్తారు. బలపరీక్షకు నేతృత్వం వహించాల్సిందిగా జెడియూకు చెందిన నరేంద్ర నారాయణ్ యాదవ్ పేరును విజయ్‌కుమార్ సిన్హా సూచించారు.