బిపోర్‌జాయ్ తుపాను.. 140 కి.మీ వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు..

940 గ్రామాల‌కు ప‌వ‌ర్‌కట్‌..

అహ్మ‌దాబాద్‌ (CLiC2NEWS): గుజ‌రాత్‌లో బిపోర్‌జాయ్ తుపాను బీభ‌త్సం సృష్టిస్తుంది. 140 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాల‌లు వీయ‌డంతో ప‌లు ప్రాంతాల్లో చెట్లు నేల‌కొరిగాయి. వంద‌లాది గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. గురువారం క‌చ్ ప్రాంతంలో తీర దాటిన తుపాను ఈ శాన్య దిశ‌గా క‌దులుతుంద‌ని.. ఈ సాయంత్రానికి వాయుగుండంగా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది.

తుపాను ప్ర‌భావంతో క‌చ్ జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. దాదాపు 940 గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. మాండ్విలోని ప‌లు నివాస ప్రాంతాల్లో, ఆస్ప‌త్రుల్లో వ‌ర‌ద నీరు భారీగా చేర‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. భావ్‌న‌గ‌ర్‌లో వ‌ర‌ద‌నీటిలో చిక్కుకున్న మేక‌ల‌ను కాపాడ‌బోయి.. తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. 24 ప‌శువులు మృతి చెందాయి.

Leave A Reply

Your email address will not be published.