రూ.70వేలు లంచం తీసుకుంటూ సిబిఐ చిక్కిన బిఐఎస్ జాయింట్ డైరెక్టర్..

విజయవాడ (CLiC2NEWS): సిలిండర్‌కు బిఐఎస్ మార్క్ కోసం లంచం డిమాండ్ చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బిఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ సిబిఐకి చిక్కారు. రూ.70వేలు లంచం డిమాండ్ చేసి.. అడ్డంగా దొరికిపోయాడు. బిఐఎస్ మార్క్ కోసం ఓ తయారీ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. దీనికి రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా ప్రణాళికతో సిబిఐ రెడ్ హ్యాండెడ్‌గా రమాకాంత్‌ను పట్టుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న లక్ష్మీ నారాయణ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సిబిఐ కోర్టులో ఇద్దరిని హాజరపరచనున్నారు.