బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌తీయ జ‌న‌తా పార్టి తెలంగాణ రాష్ట్ర క‌మిటిని అధిష్టానం ప్ర‌క‌టించింది. ముగ్గ‌రు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో పాటు ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్య‌క్షులతో కూడిన క‌మిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా గౌతంరావు, తూళ్ల వీరేంద‌ర్ గౌడ్‌, వేముల అశోక్‌ను నియ‌మించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాసం వెంక‌టేశ్వ‌ర్లు, బండారి శాంతి కుమార్‌, బూర న‌ర్స‌య్య గౌడ్‌, కొల్లి మాధ‌వి, జ‌య‌శ్రీ , బండా కార్తిక రెడ్డి, ర‌ఘునాథ్ రావు, క‌ల్యాణ్ నాయ‌క్‌ల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు తెలంగాణ బిజెపి చీఫ్ రామ చంద‌ర్ రావు వెల్ల‌డించారు. అదే విధంగా ఏడు మోర్చాల‌కు రాష్ట్ర అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించారు.

 

ఆధార్.. ఐడి ప్రూఫ్‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆమోదించాల్సిందే: సుప్రీంకోర్టు

2 Comments
  1. […] బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి […]

  2. […] బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి […]

Leave A Reply

Your email address will not be published.