యమునాలో 35 మందితో పడవ బోల్తా..

లఖ్‌నపూ (CLiC2NEWS): యుపిలో విషాదం చోటుచేసుకుంది. బాందా జిల్లాలో యమునా నదిలోపడవ బోల్లాపడింది. పడవ మునిగిపోయిన సమయంలో దాదాపు 30 నుంచి 35 ఉమంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మర్క నుంచి ఫతేపూర్ జిల్లాలోని జారౌలి ఘాట్‌కు వెళ్తుండగడా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాఖీ పండగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలితీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అభినందన్ మాట్లాడారు. ప్రమాద సమయంలో పడవలో 30 నుంచి 35 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. ఎడెనిమిది మంది ఈదుకుంటూ ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నట్లు తెలిపారు. మిగతా వారి ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.