ప్రకాశం బ్యారేజిని పడవలు ఢీకొట్టిన ఘటన.. ఇద్దరి అరెస్టు

విజయవాడ (CLiC2NEWS): భారీ పడవలు వరద ధాటికి కొట్టికొచ్చి ప్రకాశం బ్యారేజిని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆ పడవలు ఎవరివనే దానిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొట్టుకొచ్చిన పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితో పాటు సూరాయపాఎలం వాసి కోమటి రెడ్డి రామ్మోహన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని విజయవాడ కోర్టుకు తరలించారు.
ఇటీవల ప్రకాశం బ్యారేజిని భారీ పడవలు ఢీకొట్టడంతో 67,69,70 గేట్ల వద్ద సుమారు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. విజయవాడను వరదలు ముంచెత్తిన సందర్భంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సిఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజిని కూడా పరశీలించారు. అయితే .. కొట్టుకొచ్చిన బోట్లు ఎవరివని సమగ్ర విచారణ చేపట్టారు. బోట్ల కోసం ఇప్పటి వరకు దాని యజమానులు రాకపోవడంతో విచారణ జరపాలని ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పడవలు దిగువకు వదలడంపై ఏదైనా కుట్రకోణ ఉందా.. అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.