బాయిల‌ర్ పేలి ఆరుగురు మృతి

బిహార్‌ (CLiC2NEWS): న్యూడుల్స్ ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్ పేలి ఆరుగురు మ‌ర‌ణించారు. బిహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో న్యూడుల్స్ త‌యారు చేసే ఫ్యాక్ట‌రీలో బాయిల‌ర్ భారీ శ‌బ్ధంతో పేలింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెంద‌గా.. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ భారీ శ‌బ్ధం 5 కిలోమీట‌ర్ల మేర వినిపించింద‌ని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లాన‌కి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెల‌స్తోంది. ప్ర‌మాద‌సమ‌యంలో ఫ్యాక్ట‌రీలో ఎంత‌మంది ఉన్న‌ది తెలియ‌రాలేదు. బిహార్ ప్ర‌భుత్వం ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 4 లక్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.