బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘన విజయం

ప్రముఖ బాలీవుడ్ నటి ఎంపి ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయ అరంగేట్రంతోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71 వేల ఓట్ల మెజారిటీతో కంగనా విజయం సాధించారు.