విమానాలకు బెదిరింపు పోస్టులు .. పోలీసుల అదుపులో మైనర్!

ముంబయి (CLiC2NEWS): దేశవ్యాప్తంగా మూడు రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు పోస్టులు వస్తున్నాయి. మొత్తంగా 19 విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ బెదిరింపు పోస్టులు వచ్చాయి. దీంతో భద్రతా ముప్పును ఎదుర్కున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాడయి. వీటిలో కేవలం ఒక్క రోజులో 9 విమానాలకు ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుండి బయలుదేరిన విమానాలకు భద్రతా ముప్పు ఉందంటూ పోస్టు పెట్టిన ఘటనకు సంబంధించి నమోదు చేసిన కేసులో ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
విమానాలకు బెదిరింపు పోస్టులు అన్నీ నకిలీవేనని వెల్లడైనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాటి మూలాలు ఛత్తీస్‌గఢ్ నుండి ఉన్నట్లు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టినట్లు కనుగొన్నారు. మైనర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సదరు వ్యాపారవేత్తకు సమన్లు పంపించారు. నగదు విషయంలో ఏర్పడిన గొడవ కారణంగా స్నేహితుడిని ఇరికించేందుకు మైనర్ ఇదంతా చేసినట్లు సమాచారం. స్నేహితుడి పనేరుతో ఎక్స్‌లో ఓ ఖాతా సృష్టించి.. పలు విమానాలకు బెదిరింపు పోస్టులు పెట్టిన్నట్లు సమాచారాం.