44 పాఠశాలలకు బాంబు బెదిరింపులు!

బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటకలోని బెంగళూరులో సుమారు 44 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం గుర్తుతెలియని ఒక ఇ మెయిల్ నుండి ఈ బెదిరింపుకాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముందుగా 15 స్కూళ్లకు ఈ బెదిరింపు ఇమెయిల్స్ వచ్చినట్లు తెలిసింది. అనంతరం అది 44 స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఉపాధ్యాయులను, విద్యార్థులను పాఠశాలలనుండి పంపించివేశారు. దీంతో నగరంలోని విద్యాసంస్థలకు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురైనారు.