బోనాలు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ (CLIC2NEWS): హైదరాబాద్‌లో ఆదివారం బోనాలు సందడి నెలకొంది. ఇవాళ లాల్‌దర్వాజ బోనాలు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని లాల్ దర్వాజ వద్ద బోనాలు ఉత్సవాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చార్మినార్ వద్ద గల భాగ్యలక్షి అమ్మవారికి రాష్ట్ర మంత్రికోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు పట్టు వస్ట్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అంబర్‌పేటలోని మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.