ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్..

కీవ్ (CLiC2NEWS): బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో నడుస్తూ యుద్ధ పరిస్థితిపై చర్చించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా కీవ్‌కు చేరుకొన్నారు. రష్యాపై పోరుకు మరిన్ని ఆయుధాలిస్తామని బ్రిటన్ తరపున భరోసా ఇచ్చారు. జెలెన్స్కీకి సంఘీభావం ప్రకటించడానికి బోరిస్ జాన్సన్ ఆకస్మిక పర్యటన చేపట్టారు. సైనిక ఆర్ధిక పరమైన సాయాన్నిఅందించి, ఉక్రెయిన్‌కు తమ దీర్ఘకాల మద్దతును కొనసాగించనున్నట్లు ప్రకటించారు.