పెళ్లింట విషాదం.. మరికాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు ఆత్మహత్య

నిజామాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని నవీపేటలో ఓపెళ్లి కుమార్తె ఆత్మహాత్యకు పాల్పడటంతో పెళ్లింట విషాదం నెలకొంది.
పోలీసులు, మృతురాలు తరపు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటకు చెందిన ర్యాగల రవళికి వివాహం నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్ వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. ఆమె తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లి కుమారుడి వేధింపుల వలనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పెళ్లికుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.