రాష్ట్రంలో రూ.800 కోట్లతో బ్రిస్టల్ మేయర్స్ సంస్థ పెట్టుబడులు..
1500 మందికి ఉపాధి అవకాశాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/KTR.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్ రూ. 800 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ ద్వారా సుమారు 1500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. బ్రిస్టల్ మేయర్స్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒపపందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మా కంపెనీల్లో బ్రిస్టల్ మేయర్స్ ఒకటని.. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో పెట్టుబుడులు పెట్టడం గొప్పవిషయమని అన్నారు. ఒక సంస్థ తమ యూనిట్‌ను ఎక్కడైనా ప్రారంభించాలంటే 12 నుండి 18 నెలల సమయం పడుతుందని.. నగరంలో అన్ని అనుమతులు ఉన్నందున ఎలాంటి జాప్పం ఉండకుండా మొదలుపెట్టవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇతర అనుకూలతలను కూడా పరిగణలోకి తీసుకోవాలని.. సంస్థ ప్రతినిధులకు సూచించినట్లు కెటిఆర్ తెలిపారు.