మహాత్ముడి స్మారక నాణెం విడుదల చేసిన బ్రిటన్ ప్రభుత్వం
బ్రిటన్ ప్రభుత్వం ఘన నివాళి

లండన్ (CLiC2NEWS): బ్రిటన్ ప్రభుత్వం దీపావళి పర్వదినం పురస్కరించుకుని మహాత్మాగాంధీ జీవితం ఆశయాలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణాన్ని విడుదల చేసింది. బ్రిటన్ ఆర్థిక శాఖామంత్రి రిషి సునక్ గురువారం నాడు ఈ నాణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సందర్భంగా గాంధీ స్మారక నాణాన్ని ఆవిష్కరించటం గర్వంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలచిన నాయకుడి జీవితాన్ని స్మరించుకుంటూ మొదటిసారి బ్రిటన్ నాణెం రూపొందించడం ఇది ఘన నివాళి అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారత్ ఆజాదీక అమృత్ మహోత్సవ్` జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. అ స్మారక నాణెం రెండు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికిప్రతీకగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ నాణెంపై భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీజి సూక్తులలో ఒకటైన `మై లైఫ్ ఇజ్ మై మెసేజ్` ఉంటాయి. ఈ నాణెం బంగారం, వెండితో పాటు ఇతర రకాలలోనూ అందుబాటులో ఉంటుంది.