నా భుజంలో ఉన్నది భారత్ టీకా: బ్రిటన్ ప్రధాని
సచిన్, అమితాబ్‌లా అనిపించింది.
ఢిల్లీ (CLiC2NEWS): కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంశించారు. తాను కూడా భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్నానని.. అది తనను సురక్షితంగా ఉంచుతోందన్నారు. ఈ విషయంలో భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచ ఫార్మసీగా భారత్ ఎదుగుతోందని కొనియాడారు.
భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తున్నాయని తెలపారు. వీటితో పాటు రక్షణ, భద్రతా రంగాల్లో పలు విషయాలపై అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోడి మాట్లాడుతూ.. భారత్, బ్రిటన్ మధ్య గతేడాది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని, ఈ దశాబ్ధంలో ఇరు దేశాల సంబంధాలకు ఓ దిశ చూపేందుకు ఓ గొప్ప మార్గసూచీ 2030ని కూడా ప్రారంభించామని అన్నారు.
అన్ని దేశాల ప్రదేశిక సమగ్రత, సార్వభౌమాధికారినికి ప్రాముఖ్యతను ప్రధానంగా చర్చించాం. ఇదే సమయంలో శాంతియుత, సుస్థిర ఆఫ్గానిస్థాన్‌కు మా మద్దతు ఇస్తున్నాం అని ప్రధాని నరేంద్ర మోడి పేర్కొన్నారు.
సచిన్, అమితాబ్‌లా అనిపించింది.
బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక చర్చలు ఇరుదేశాల సంబంధాలను మరింత బోపేతం చేస్తాయన్నారు. రక్షణ భద్రతీ రంగాల్లో ఇరు దేశాల బాగస్వామ్యంలో పలు ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన ఆయన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-బ్రిటన్ స్నేహబంధం అత్యంత పూరాతనమైనదని అన్నారు. భారత్‌లో తనకు లభించిన ఆదరణ ప్రపంచంలో ఇంకెక్కడా లభించలేదన్నారు. భారీ హోర్డింగ్‌లతో తనకు ఘన స్వాగతం పలికిన తీరు చూసి.. సచిన్ టెండుల్కర్ అమితాబ్ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నిరు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.