సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
అహ్మదాబాద్ (CLiC2NEWS): బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానశ్రయంలో గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులు ఘన స్వాగంత పలికారు.
బోరిస్ జాన్సన్ గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో చరఖా తిప్పిన ఆయన సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సత్యం, అహింస వంటి మార్గాతలో ప్రపంచాన్ని కదిలించిన మహానేత గాంధీ అని కొనియాడారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌లో ఉండటం చాలా అద్భుతంగా ఉందని జాన్సన్ అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్థ గౌతమ్ ఆదానీతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యూ ఇండియా వ్యాపార, పెట్టుబడుల ఒప్పందాల ద్వారా కొత్తగా 11 వేల యుకె ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటన్ ప్రధాని తెలిపారు. యుకె – భారత్ భాగస్వామ్యం తమ ప్రజలకు ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలు అందిస్వోందని అన్నారు. ఈ భాగస్వామ్యం రాబోయే రోజుల్లో బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.