విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద బస్సు, ట్రక్కు
Broken cliffs .. Bus, truck under the rubble
సిమ్లా (CLiC2NEWS): హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో -సిమ్లా హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, కొండచరియల కింద పలు వాహనాల్లో సుమారు పదుల సంఖ్యలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది. ఈ ఘటనలో ఎంత మంది మృతిచెందారో ఇంకా తెలియలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిదిమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. హిమాచల్ సిఎం జైరామ్ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడి కేంద్రం తరఫున అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK
— ITBP (@ITBP_official) August 11, 2021