olympics: బాక్సింగ్‌లో లవ్లీనాకు బ్రాంజ్ మెడల్
సెమీస్‌లో ఓటమి

Lovlina Borgohain:
టోక్యో:
ఒలింపిక్స్‌లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. కానీ టోక్యో క్రీడల్లో ఆమెకు దక్కింది కాంస్యమే అయినా అది స్వర్ణంతో సమానమే..!
ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందిస్తోంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వచ్చిన మూడో మెడల్ ఇది. గతంలో విజేందర్, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. ఆరంగేట్రం మెగా క్రీడల్లోనే పోడియంపై నిలబడిన బాక్సర్‌గా దేశానికి వన్నె తెచ్చింది
ప్రత్యర్థి టర్కీ దేశానికి చెందిన సుర్మెనెలి గోల్డ్ మెడల్‌కు ఫెవరేట్.. ఈ సంవత్సరం సుర్మెనెలి రెండు అంతర్జాతీయ పోటీ్ల్లో స్వర్ణాలు గెలిచింది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 16 సార్లు పతకాలు కొల్లగొట్టింది. పిడిగుద్దులు, హుక్స్, బాడీ షాట్స్‌తో విరుచుకుపడే సుర్మెనెలిపై లవ్లీనా స్ఫూర్తిదాయకంగా పోరాడింది.