తిరుప‌తి: క‌పిల తీర్థం స‌మీపంలో జంట హ‌త్య‌లు..

-తిరుప‌తి (CLiC2NEWS): క‌పిల తీర్థం స‌మీపంలోని ఓ హోట‌ల్‌లో అక్కాత‌మ్ముడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌హారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువ‌రాజ్‌ తిరుప‌తిలోని క‌పిల‌తీర్థం స‌మీపంలో ఉన్న ఓ హోట‌ల్‌లో భార్య‌ను, త‌న‌ త‌మ్ముడిని హ‌త్య‌చేశాడు. యువ‌రాజ్‌కు 12 సంవ‌త్స‌రాల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ప్ర‌క్ష‌య్‌, ప్ర‌జ్ఞ ఉన్నారు. భార్య‌కు త‌న సోద‌రుడికి వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానంతో సంవ‌త్స‌రం నుండి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో నాలుగు రోజుల క్రితం యువ‌రాజ్ తిరుప‌తికి వ‌చ్చి..త‌న భార్య‌కు ఫోన్ చేసి ర‌మ్మ‌న్నాడు. మ‌నీష త‌న త‌మ్ముడుతో క‌ల‌సి పిల్ల‌ల‌ను తీసుకొని తిరుప‌తికి చేరుకుంది. హోట‌ల్ రూంలో పిల్ల‌ల ముందే యువరాజ్ త‌న భార్య‌ను, ఆమె సోద‌రుడును కిరాత‌కంగా హత్య‌చేశాడు. అనంత‌రం పోలీసుల‌కు లొంగ‌పోయాడు.

Leave A Reply

Your email address will not be published.