ఢిల్లీలో బిఆర్ ఎస్ కార్యాల‌యం వ‌ద్ద ఫ్లెక్సీలు తొల‌గింపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): రేపు భార‌త్ రాష్ట్ర స‌మితి (బిఆర్ ఎస్‌) కార్యాల‌యాన్ని ఢిల్లీలో సిఎం కెసిఆర్ ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. జాతీయ కార్యాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్ల‌క్సీలు న్యూఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు తొల‌గించారు.
బిఆర్ ఎస్ నేత‌లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ ఢిల్లీ విమానాశ్ర‌యానికి వెళ్లే మెయిన్‌రోడ్డు కావ‌డంతో.. ఆ మార్గం విఐపిలు తిరిగే ప్రాంతం కావ‌డంతో వాటిని తొల‌గించామ‌ని న్యూఢిల్లీ మున్సిప‌ల్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లోని అద్దె భ‌వ‌నంలో బిఆర్ ఎస్ జాతీయ కార్యాల‌యాన్ని పార్టీ అధినేత కె. చంద్ర‌శేఖ‌ర‌రావు రేపు మ‌ధ్యాహ్నం 12.36 నిమిషాల‌కు ప్రారంభించ‌నున్నారు. ఈకార్య‌క్ర‌మానికి, ఎస్ పి అధినేత అఖిలేష్‌, ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ తో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌రుకానున్నారు.

1 Comment
  1. zoritoler imol says

    Excellent weblog right here! Additionally your site so much up very fast! What web host are you using? Can I am getting your affiliate hyperlink in your host? I desire my web site loaded up as quickly as yours lol

Leave A Reply

Your email address will not be published.