కాంగ్రెస్ గూటికి చేరనున్న పలువురు బిఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ వరంగల్ లోక్‌సబ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కడియం కావ్య పోటీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్‌కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యిపింగ్, లిక్కర్ స్కాం వంటివి బిఆర్ ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని ఆమె పేర్కొన్నారు. ఇట్టి పరిస్థితిలో తాను పోటీ నుండి విరమించుకోవాలని నిర్ణయించున్నట్లు ఆమె లేఖలో తెలిపారు.
మరోవైపు సీనియర్ నాయకుడు బిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కెశవరావు(కెకె) , ఆయన కుమార్తె హైదరాబాద్ నగర మేయర్ జి. విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడుతూ.. తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని, తిరిగి తన పూర్వ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.