కారు ప్ర‌మాదంలో బిఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత క‌న్నుమూత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత క‌న్నుమూశారు. ఎమ్మెల్యే ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణిస్తున్న కారు ప‌టాన్ చెరు ఒఆర్ ఆర్ వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది. కారు అదుపుత‌ప్పి రెయిలింగ్ ను ఢీకొట్ట‌డంతో ఘ‌ట‌నాస్థ‌లంలోనే ఎమ్మెల్యే మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే ఆమె పిఎ ఆకాశ్‌, డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Leave A Reply

Your email address will not be published.