మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ (CLiC2NEWS): మంత్రి శ్రీధర్‌బాబును బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రని కోరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి , వివేకానంద గౌడ, మాధవరం కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి , అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ శ్రీధర్‌బాబును కలిసి అభివృద్ధి పనుల కు సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిహెచ్ఎంసికి నిధులు ఇవ్వలేదని.. జిహెచ్ఎంసికి నిధులు విడుదల చేయాలని మంత్రి దృష్టికి తెచ్చారు.