బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు..
హైదరాబాద్ (CLiC2NEWS): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇడి అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. సాదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేసినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేసినట్లు ఇడి అధికారులు కవితకు మొమో ఇచ్చిన్నట్లు పేర్కొన్నారు.
కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బిఆర్ ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ తెలిపారు.సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా.. ఎన్నికల ముందు అరెస్టు ఏంటని ఆయన ప్రశ్నించారు. కవిత నివాసం వద్ద బిఆర్ ఎస్ కార్యకర్లు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త నెలకొంది. ఆమె కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా పోరాడతామని, పార్టీ శ్రేణులు బంలంగా మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.