సిఎం రేవంత్ రెడ్డితో బిఆర్ఎస్ ఎంపి కేశవరావు భేటి

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బిఆర్ఎస్ ఎంపి కె. కేశవరావు (కెకె) భేటీ అయ్యారు. కేశవరావు కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణిరెడ్డితో పాటు సిఎంను మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. త్వరలో తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కెకె కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి పాల్గొన్నారు.