దేశ రాజధానిలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయం ను పార్టీ అధినేత ముఖ్మమంత్రి కెసిఆర్ ప్రారంభిచారు. ముందుగా పార్టీ కార్యలయం ఆవరణలో బిఆర్ ఎస్ జెండాను ఆవిష్కరించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించిన అనంతరం కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సిఎం కెసిఆర్ రెండు రోజులు రాజధానిలో ఉంటున్నట్లు సమాచారం. పలు విపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాల్లోని ప్రముఖులతో సమావేశమయ్యే అవకామున్నట్లు తెలుస్తోంది.