Budget 2022: 400 వందే భారత్ రైళ్లు..
-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూడిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సారి కూడా కాగితరహిత బడ్జెట్‌ను ఆమె సమర్పించారు.
వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్ అభివర్ణించారు. బడ్జెట్ 2022-23 ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ కట్టడిలో వాక్సినేషన్ కార్యక్రమం బాగా ఉపయోగపడిందని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో కరోనా టీకాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి వెల్లడించారు. పారదర్శకమైన సమీకృత అభివృద్ధిక ఈ బడ్జెట్ నాంది అని మంత్రి అన్నారు.
400 వందే భారత్ రైళ్లు..
రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి ప్రకటించారు.
“పిఎం గతి శక్తి పథకంలో సంతులిత అభివృద్ధి సాధించాం. మేకిన్ ఇండియా పథకంలో 6 మిలియన్ల ఉద్యోగాలు 500 వందే భారత్ రైళ్లు, 100 గతిశక్తి టెర్మినల్స్ జాతీయ రహదారులు మరో 25 వేల కి.మీ. విస్తరణ చేయనున్నట్లు“ మంత్రి తెలిపారు.
2023 చిరుధాన్యాల సంవత్సరం..
2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ఆర్ధిక మంత్రి ప్రకటించారు..
“దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహకం, నదుల అనుసంధానికి పెద్దపీట వేస్తాం, కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరీ నదులను అనుంధానిస్తామని“ అని తెలిపారు.