బడ్జెట్ ఎఫెక్ట్.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!
Budget 2024: లోక్సభలో నిర్మలా సీతారమాన్ మంగళవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు రకాల వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. బంగారం , వెండి వస్తువులు , కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 6% తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీనికి 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రా అండ్ డెవలప్ మెంట్ సెస్ అదనం. దీంతో బంగారంపై చెల్లించే మొత్తం పన్ను 11% శాతం అవుతుంది.
కస్టమ్స్ సుంకం కుదించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు మధ్యాహ్నానికి ఎంసిఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,000 తగ్గి రూ. 68,500 కు చేరింది. వెండి కూడా కిలో రూ. 2,500 తగ్గి రూ. 84,275 వ్ద ట్రేడవుతోంది. మరోవైపు బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. 75,550 ఉండగా.. బడ్జెట్ అనంతరం రూ. 71,060కి చేరింది. అటు వెండి సైతం అదే బాటలో ఉంది. కిలో వెండి ధర రూ. 91,500 ఉండగా.. రూ.87,500కు చేరింది.