నిశ్చితార్ధానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
చిత్తూరు ఘాట్ రోడ్‌లో లోయలో పడిన ప్రైవేటు బస్సు

చంద్రగిరి (CLiC2NEWS): చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు 60 అడుగుల లోయలోకి దూసుకుపోయింది. ధర్మవరం నుండి తిరుచానూరు నిశ్చితార్థానికి వెళ్తుండగా మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు వద్ద బస్సు ప్రమాదానికి గరైంది. ఈ ప్రమాదంలో 8మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో 63 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు సైతం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. పది 108 వాహనాలు, నాలుగు మిని వ్యాన్లతో క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.