సి-295: తొలి సైనిక రవాణా విమానం..

ఢిల్లీ (CLiC2NEWS): భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితం స్సెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సి-295 సైనిక రవాణా విమానాన్ని భారత్‌కు అప్పగించింది. 2025 నాటికి ఫ్లై అవే కండిషన్‌లో ఉన్న 16 విమానాలను డెలివరీ చేయనుంది. దీనిని స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ రూపొందించింది. భారత ప్రభుత్వం దీనికోసం రూ. 21,935 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ స్పానిష్ నగరం, సెవిల్లెలోని ఏరోస్సేస్ ఉత్పత్తి కేంద్రం వద్ద భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి తొలి విమానాన్ని అందుకున్నారు. దీనిని భారత్ తీసుకొచ్చిన అనంతరం సెప్టెంబర్ 20వ తేదీన హిండన్ ఎయిర్‌బేస్‌లో అధికారికంగా భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.