ఎపి కేబినేట్‌లో పలు కీలకాంశాలకు మంత్రివర్గం ఆమోదం..
అమరావతి (CLiC2NEWS): తొలి రోజు కేబినేట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సిఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 5 హామీల దస్త్రాలపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైద్యారోగ్య వర్సిటికి ఎన్‌టిఆర్ పేరు పునరిద్ధరించాలని నిర్ణయించింది.
సిఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం తొలి కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెగా డిఎస్‌సి ద్వారా 16,347 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై ఒకటి నుండి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు పోస్టుల భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. అదేవిధంగా ఏప్రిల్ నుండి పింఛను రూ. 4వేలకు పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జులై 1 నుండి పెంచిన పింఛనను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గల మూడు నెలలు కలిపి జులై 1న రూ. 7వేల పింఛను అందనుంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్‌య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.