ప్రపంచ డ్రోన్ డిస్టినేషన్‌గా ఎపి..
అమరావతి (CLiC2NEWS): ప్రపంచ డ్రోన్ డిస్టినేషన్‌గా ఎపి.. డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు అభివృద్ది చేయబోతున్నట్లు మంత్రి పార్ధసారథి తెలిపారు. బుధవారం సిఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కేబినేట్ సమావేశనాంతరం ఆయన మీడియాకు వెల్లడిస్తూ.. ఎపి డ్రోన్ పాలసీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీనీ తీసుకొచ్చారు. డ్రోన్ రంగంలో 40వేల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డి ఫెసిలిటి ఏర్పాటు.. 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. 50 డ్రోన్ స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.