కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గం ఆమోదం..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన కాబినేట్ సబ్ కమిటి ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం అసెంబ్లీలో జాబ్ కాలెండర్‌ను ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు.
గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ. 437 కోట్లు విడుదలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. జిహెచ్ ఎంసి ఔటర్ గ్రామాల విలీనానికి మంత్రివర్గం సబ్‌కమిటి ఏర్పాటు చేయడానికి నిర్జ్ఞించారు. మంత్రులు సీక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.