ఎపిలో కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో కొత్త మద్యమం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సగటు మద్యం ధర 99 నుంచి అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ భేటీ లో చర్చించారు. వాలింటర్ల పునరుద్ధరణ పై మరింత సమాచారం తీసుకోవాలని సిఎం చంద్రబాబు సూచించారు.
మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు
- పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూ సి సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయం.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ `సెమీ` పథకం ప్రారంభం - ఆధార్ తరహాలో విద్యార్థులకు `అపార్` గుర్తింపు కార్డులు
- హోం శాఖలో కొత్త కార్పోరేషన్ ఏర్పాటు.
- వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు