ఎపి కేబినేట్ కీలక నిర్ణయాలు
అమరావతి (CLiC2NEWS): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 21 కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. హడ్కో ద్వారా రూ.11 వేల రుణం తీసుకునేందుకు అనుమతి, పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం తెలిపింది. సమావేశానంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వివరించారు.
రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఎపిలోని 1.41 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. ధాన్యం కొనుగోలు కోసం మర్క్‌ఫెడ్ ద్వారా రూ. వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం .. బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది. జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. క్లీన్ ఎనర్జి కోసం ఎన్‌టిపిసి ద్వారా పెట్టుబడులకు జాయింట్ వెంచర్ ఏర్పాటు రూ.1.70లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ఎపి కేబినేట్ ఆమోదం తెలిపింది.