ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. బిల్లుకు ఎపి మంత్రివర్గం ఆమోదం

అమరావతి (CLiC2NEWS): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎపి మంత్రి వర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణానకి ప్రభుత్వం గ్యారంటీ తదితర అంశాలకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. రైతుల నుండి ధ్యాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సిడిసి నుండి రూ. 3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.