ధరణి సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘం

హైదరాబాద్‌ (CLiC2NEWS): ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలో ధరణి సమస్యలపై పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉప‌సంఘంలో సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉప సంఘానికి కన్వీనర్‌గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా ఉప సంఘం ధరణి సమస్యలపై పూర్తిస్థాయిలో కూలంక‌శంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Leave A Reply

Your email address will not be published.