‘భారతీయుడు 2’ నుండి క్యాలెండర్ సాంగ్..

‘భారతీయుడు 2’ చిత్రంలో 2017 మిస్ యూనివర్స్ నటించిన ‘క్యాలెండర్ సాంగ్’ విడుదలైంది. సినిమా చిత్రీకరణ పూర్తయిన అనంతరం ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రబృందం. చిత్రం లోని ఒక్కోపాటను విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా క్యాలెండర్ సాంగ్ లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేసింది. ఈ పాటలో 2017 మిస్ యూనివర్స్ డెమి నటించింది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చగా.. శ్రావణ భార్గవి ఆలపించారు. ఇక కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.