AP: గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన డిఎస్‌సి ప్ర‌క‌ట‌న ర‌ద్దు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన డిఎస్‌సి ప్ర‌క‌ట‌న ర‌ద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. చంద్ర‌బాబు సిఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం 16,347 పోస్టుల‌తో మెగా డిఎస్‌సిపై తొలి సంత‌కం చేసిన విష‌యం తెలిసిందే. మెగా డిఎస్‌సితో పాటు ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష నిర్వ‌హించేందుకు కొత్త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో జులై 1న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేంద‌కు అధికారులు క‌స‌రత్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో టెట్ ప‌రీక్ష రాసి అర్హ‌త సాధించ‌ని వారు, ఈ టెట్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత బిఇడి, డిఇడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్‌సితోపాటు టెట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. గ‌త డిఎస్‌సికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు రుసుములు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు, కానీ .. కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.